బిర్యానీ నుంచి బయో-వరల్డ్ దాకా..ప్రపంచ జీవ వైవిధ్య పరిశోధనలకు రాజధానిగా హైదరాబాద్

బిర్యానీ నుంచి బయో-వరల్డ్ దాకా..ప్రపంచ జీవ వైవిధ్య పరిశోధనలకు రాజధానిగా హైదరాబాద్
  • బయోలో రెండేళ్లలోనే 73 వేల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్​
  • వ్యాక్సిన్ కేపిటల్ టు లైఫ్ సైన్సెస్ రాజధానిగా చేస్తున్నాం
  • మాలిక్యూల్స్ నుంచి మెడిసిన్ వరకు ఇక్కడే డిజైన్! 
  • పెట్టుబడులతో రావాలని ఇన్వెస్టర్లకు పిలుపు
  • హైటెక్స్​లో బయో ఏషియా సదస్సు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అంటే బ్రాండ్ అని.. తెలంగాణ అంటేనే బిజినెస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌‌ను సమగ్ర జీవ వైవిధ్య పరిశోధనలకు రాజధానిగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. హైటెక్స్‌‌లో మంగళవారం పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి 23వ ‘బయో ఏషియా-2026’ అంతర్జాతీయ సదస్సును సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బృహత్తర ప్రణాళికను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ‘‘23 ఏండ్ల కిందట బయో ఏషియా ప్రారంభమైప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఐటీ, ఔషధ తయారీగా మాత్రమే గుర్తింపు ఉండేది. కానీ, నేడు హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఎదిగింది.

దూరదృష్టి కలి గిన నాయకత్వం, స్పష్టమైన విధానాలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైంది. అందుకే హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్‌‌గా అవతరించింది’’ అని వివరించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఇక ఆగదని సీఎం పేర్కొన్నారు.

గత రెండేళ్ల కాలంలోనే లైఫ్ సైన్సెస్ రంగంలో ఏకంగా 73 వేల కోట్ల రూపాయ ల పెట్టుబడులను సాధించామని, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన వృద్ధి కాదు.. ఒక శక్తివంతమైన విజన్ తో వచ్చిన ఫలితం అని ప్రకటించారు. బయో ఏషియా తన పేరును మించి ‘బయో వరల్డ్’గా రూపాంతరం చెందిందని సీఎం అన్నారు. ‘‘నేడు ఇక్కడ 500 అగ్ర శ్రేణి కంపెనీల నుంచి 4వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.

ఫార్మా, బయో సైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్, హెల్త్‌‌కేర్ రంగాలకు చెందిన దిగ్గజాలు ఇక్కడ ఉన్నారు. సైన్స్, ఏఐ, బయోటెక్, మాన్యుఫ్యాక్చరింగ్, పాలసీ మేకర్లు కలిస్తే అసాధార ణ ఫలితాలు వస్తాయి. త్వరలోనే దావోస్‌‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలాగా హైదరాబాద్‌‌ బయో ఆసియాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

‘‘ఇటీవలే మేము విజన్ తెలంగాణ రైజింగ్ 2047’’ను ఆవిష్కరించాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాల న్నదే మా లక్ష్యం. ఇందుకోసం రీసెర్చ్ ల్యాబ్‌‌లు, కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్‌‌లు, ఎంఎస్ఎంఈలు, ప్రభుత్వం మధ్య బలమైన సమన్వయం ఉండాలి. ఆ భరోసాను, స్థిరమైన వ్యవస్థను తెలంగాణ ఇస్తుంది.

మీ అన్ని ప్రశ్నలకు హైదరాబాద్‌‌ ఒకటే సమాధానం’’ అని సీఎం స్పష్టం చేశారు. ‘‘మేము కేవలం భారత్‌‌లోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదు.. ప్రపంచంలోని అత్యుత్తమ గ్లోబల్ క్లస్టర్లతో పోటీ పడుతున్నాం. వరల్డ్ క్లాస్ పరిశోధనల కోసం ‘వన్ బయో’ను తెచ్చాం. గ్రీన్ ఫార్మా సిటీ పనులను వేగవంతం చేయడంతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్‌‌ను అడ్డాగా మార్చాం" అని వివరించారు.

ఇన్వెస్ట్ చేయండి.. మాతో కలిసి నడవండి

తెలంగాణకు రావాలని, పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ కోరారు. ‘‘మీ జీసీసీలను ఏర్పాటు చేయండి, ఇన్నోవేషన్ ఇంజన్లను నిర్మించండి. కొత్త డ్రగ్స్, మాలిక్యూల్స్ డిజైన్ చేయండి. క్లినిక ల్ అనలిటిక్స్, ఏఐ ప్లాట్‌‌ఫామ్‌‌ లు, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ను నడపండి. మీ విజయ ప్రయాణంలో మా ప్రభుత్వం, అధికా రులు, శాస్త్ర వేత్తలు, నైపుణ్యం కలిగిన యువత, స్థానిక వ్యాపారులు భాగస్వాములుగా ఉంటా రు.

మనమంతా కలిసి పనిచేస్తే హైదరాబాద్‌‌ ‘వ్యాక్సిన్ రాజధాని’ హోదా నుంచి ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్’గా మారుతుంది. తెలంగాణ అంటేనే బిజినెస్.. తెలంగాణ సిద్ధంగా ఉంది.. రైజింగ్ తెలంగాణలో మీరు భాగస్వాములు అవ్వండి’’ అని సీఎం పిలుపునిచ్చారు. ఈ వేదిక పై సీఎం రేవంత్ చేతుల మీదుగా పెన్సిల్వేని యా వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్. లెవిన్‌‌కు ప్రతిష్టాత్మకమైన ‘జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు-2026’ అందించారు.